ఫైర్ స్ట్రోమ్ అంటూ వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్లిన అబ్బాయిలు నిఖిల్, సాయి, గౌరవ్ లు చక్కగా ఆడుతుంటే.. దివ్వెల మాధురి, అయేషా, రమ్య లు ఆటలకన్నా వారి గొంతు అందరిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అందరికి నీతులు చెప్పడమంటే తనూజ సింపతీ గేమ్ ఆడుతుంది, ఆమె నాన్న అంటూ ఫైనల్ వరకు వెళ్లిపోవచ్చని ప్లాన్ చేసింది అన్న అయేషా హౌస్ లో ఏం చేస్తుంది.
నిన్నటి కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయి హౌస్ లో ఆమె చేసిన రచ్చ, ఆ ఏడుపు వింటే బుల్లితెర ఆడియన్స్ మరోసారి బిగ్ బాస్ చూసే సాహసం చెయ్యరు. ఇక మరో కంటెస్టెంట్ దివ్వెల మాధురి ని చూస్తే ఆ దువ్వాడ శ్రీనివాస్ ఎలా భరిస్తున్నాడురా బాబు అనుకోవాల్సిందే. ఆ ఇద్దరినీ అవకాశమొస్తే బుల్లితెర ప్రేక్షకులు ఇంటికి పంపించేసేలా ఉన్నారు.
వారు గనక నామినేషన్స్ లోకి వచ్చిందే తడువు వాళ్ళని ఎలిమినేట్ చేసేలా ఓట్లు వేయకూడదని బుల్లితెర ప్రేక్షకులు కాచుకుని కూర్చున్నారంటే నమ్మాల్సిందే. అసలు మాధురి, అయేషా లాంటి వాళ్ళ వల్లే బిగ్ బాస్ పరువు పోయేది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.