దివాళి లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకునేందుకు కుర్ర హీరోలు మీడియం రేంజ్ సినిమాలతో పోటీపడ్డారు. నిన్న ప్రియదర్శి మిత్ర మండలి తో దిగితే.. ఈరోజు శుక్రవారం సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి పోటీగా ఈ రోజే తమిళ హీరో ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్ తో దూసుకొచ్చాడు. తెలుగులో మైత్రి వాళ్ళు రిలీజ్ చెయ్యడంతో దానిపై అంచనాలు పెరిగాయి.
ఇక ఈరోజు పోటీపడిన తెలుసు కదా, డ్యూడ్ చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ వీక్షించిన ఓ ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు.
వెరీ బోల్డ్ ఫ్రైడే.. నా ఊహకు కూడా అందని రెండు కథలు ఈరోజు చూశాను..
తెలుసు కదా బోల్డ్ అనుకుంటే.. డ్యూడ్ దానికి మించి ఉంది..
తెలుసు కదా లో సిద్దు బెస్ట్ అనిపించాడు, కానీ కొంతమందికి తెలుసు కదా కనెక్ట్ అయితే కొంతమంది సో సో అనేసారు.
కమర్షియల్ గా డ్యూడ్ సినిమా కచ్చితంగా సేఫ్ అవుతుంది..
కానీ సినిమా చూసినప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది కదా అది అయితే నాకు రాలేదు..
ఏమో నా మైండ్ ఇంకా అంత మెచ్యూర్ కాలేదేమో..
ఇలాంటి కథ నేను డైజస్ట్ చేసుకోలేకపోయాను..
గతంలో కన్యాదానం లాంటి సినిమాలలో ఈ తరహా కథలు వచ్చాయి..
అయితే డ్యూడ్ సినిమాలో చెప్పింది మాత్రం అంతకుమించి ఉంది..
ఫస్టాఫ్ వరకు నో కంప్లైంట్స్.. సినిమా అదిరిపోయింది.. రాకెట్ స్పీడ్ లో వెళ్లిపోయింది..
సెకండ్ హాఫ్ లోనే అసలు ట్విస్ట్ వచ్చింది..
ఆ మెయిన్ ట్విస్ట్ రివిల్ అయిన తర్వాత కథతో నేను డిస్ కనెక్ట్ అయిపోయాను..
ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి..
కానీ మెయిన్ స్టోరీతో ఆఫ్ అయిపోవడం మూలానో ఏమో కానీ సినిమా నాకు అంతగా ఎక్కలేదు..
అలాగని డ్యూడ్ బాగోలేదని కాదు.. నాకు నచ్చలేదు..
ఇలాంటి కథలకు కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.. ఎందుకంటే రియాలిటీ బయట ఇలాగే ఉంది కాబట్టి..
పరువు హత్య కాన్సెప్ట్ జెన్ జీ స్టైల్ లో తీయడం దర్శకుడు కీర్తిశ్వరన్ గొప్ప విషయమే..
సెన్సిటివ్ పాయింట్స్ ఇందులో డీల్ చేశాడు..
క్లైమాక్స్ ఇంకాస్త బెటర్ గా తీసి ఉంటే బాగుండేది..
ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా నటించాడు.. మనోడిలో ధనుష్, రజినీకాంత్ ఇద్దరు మిక్స్ అయ్యారు..
మమిత బైజు చాలా బాగా నటించింది.. మరో కీలక పాత్రలో శరత్ కుమార్ అదరగొట్టాడు..
దర్శకుడు కీర్తిశ్వరన్ బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు.. చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా..
ఈ సినిమాకు మరో హీరో మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్..
ఓవరాల్ గా డ్యూడ్.. వెరీ బోల్డ్.. నాకైతే నచ్చలేదు.. నాకు మాత్రమే..!