బిగ్ బాస్ సీజన్ 9 లోకి వైల్డ్ కార్డు అంటూ ఫైర్ స్ట్రోమ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిలు పాత హౌస్ మేట్స్ ని టార్గెట్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. అబ్బాయిలు నిఖిల్, సాయి, గౌరవ్ వీళ్ళు ఓకే. కానీ దివ్వెల మాధురి దివ్య ని టార్గెట్ చేస్తే అయేషా తనూజ ను టార్గెట్ చేసింది. ఆమె అసలు టార్గెట్ తనూజ అనే కాన్సెప్ట్ తోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రమ్య రీతూ-పవన్ మధ్య చిచ్చు పెట్టేస్తుంది.
అయేషా అయితే హౌస్ లోకి కొట్లాటకు వచ్చింది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. అబ్బాయిలా నడక, బర్రె గొంతు వేసుకుని ఆమె గొడవపడినా, నవ్వినా హౌస్ నుంచి కాదు కాదు ఆడియన్స్ టివి కట్టేసి పారిపోతున్నారు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ అయిన గౌరవ్, నిఖిల్, సాయి, సుమన్ శెట్టి, అయేషా, మాధురి, రమ్యలలో ఇద్దరు కెప్టెన్స్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు.
ఈ టాస్క్ లో సుమన్ శెట్టి గెలిచినట్టుగా ప్రోమో వదిలారు. దివ్వెల మధురిని విడిపించాలని అయేషా లాక్ తియ్యడానికి ట్రై చెయ్యగా లాస్ట్ లో ఓపెన్ చెయ్యడంతో వారిద్దరూ ఓడిపోయారు. దానితో అయేషా చెంపలపై కొట్టుకుని సీన్ క్రియేట్ చేసింది. గట్టి గట్టిగా ఏడుస్తూ అయేషా చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు.
తనూజ ను టార్గెట్ చేస్తూ నామినేషన్ పాయింట్స్ పెట్టిన అయేషా ఇపుడేం చేసింది. ఆమె కూడా టాస్క్ గెలవలేకపోయి ఏడుస్తూ కూర్చుంది. ఈమె తనూజాను తప్పు పడుతుంది అంటూ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పవాళ్లు అయేషా ని ఏసుకుంటున్నారు.