క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ఎన్నో రోజులుగా సక్సెస్ కోసం పరితపిస్తుంది. తెలుగులో ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ తర్వాత ఇప్పటివరకు పాపకు హిట్ పడలేదు. వరస అవకాసలోచ్చాయి కానీ అదృష్టం లేకపోవడం కృతి శెట్టి కి మైనస్ అయ్యింది. అటు తమిళనాట కృతి శెట్టి కి ఒక్క సూపర్ హిట్టు లేదు.
కృతి శెట్టి ఒప్పుకున్న తమిళ్ మూవీస్ ఏళ్లతరబడి సెట్ పైనే ఉంటున్నాయి. అయితేనేమి ఇప్పుడు కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఒకే నెలలో విడుదలవడానికి రెడీ అవుతున్నాయి. మరి ఆ లెక్కన కృతి శెట్టికి మంచి రోజులొచ్చినట్టే కదా..
కార్తీకి జంటగా కృతి శెట్టి నటిస్తున్న వా వాద్దియార్ చిత్రం డిసెంబర్ లో విడుదల కాబోతుంది అదే నెలలో తర్వాత ప్రదీప్ రంగనాథన్ కృతి చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) కూడా విడుదల కాబోతుంది. కృతి నటిస్తున్న మరో తమిళ చిత్రం జీవీ. రవిమోహన్ నాయకుడిగా తెరకెక్కిన చిత్రం కూడా అదే నెలలో విడుదల కాబోతుంది. ఈమూడు చిత్రాల్లో ఏది క్లిక్ అయినా కృతి పేరు మార్మోగిపోతుంది. చూద్దాం కృతి శెట్టి లక్ ఎలా ఉందొ అనేది.