కొన్ని వారాలుగా బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి వారం నుంచి బుల్లితెర ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్న కన్నడ పిల్ల తనూజ కి ఈ వారం మొదట్లో కూడా బాగానే సపోర్ట్ దక్కింది. ఎప్పుడు నామినేషన్స్ లోకి వచ్చినా తనూజ కి ఓట్లు గుద్దుతున్నారు. కానీ ఈ వారం తనూజ గ్రాఫ్ పడిపోయింది.
భరణి ని నాన్న అంటూ, వైల్డ్ కార్డు ఎంట్రీ దివ్య రాగానే తన ప్రయారిటీ తగ్గిపోయింది అంటూ తనూజ అస్తమాను ఏడ్వడం, ఎమోషనల్ అవడం, అరవడం అన్ని తనూజ గ్రాఫ్ పడిపోయేలా చేసింది అంటున్నారు. నామినేషన్ లోకి రాగానే హవా చూపించిన తనూజ మూడోరోజుకి ఓట్స్ తగ్గిపోయాయి. తనూజ తన ఆటను తానే పాడు చేసుకుంది అనే మాట బాగా వినబడుతుంది.
ప్రస్తుతం సుమన్ శెట్టి ఓటింగ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా.. డిమోన్ పవన్ సెకండ్ ప్లేస్ లోకి రావడంతో తనూజ మూడో స్థానానికి పడిపోయింది. మరి టాస్క్ ల్లో గెలిచి మళ్లీ తనూజ ఆడియన్స్ మనసు గెలుస్తుందేమో చూడాలి.