వారం రోజుల్లో రాబోతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే కోసం అభిమానులు వెయిట్ చెయ్యని క్షణం లేదు. ప్రభాస్ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకోవడమే కాదు.. ఆయన సినిమాల నుంచి వచ్చే ట్రీట్స్ తో సంబరాలు చేసుకోవడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏడాది ప్రభాస్ బర్త్ డే ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా ప్రత్యేకం.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే ప్రభాస్ బర్త్ డే కి కన్ ఫర్మ్ అయినట్లే. రీసెంట్ గానే రాజా సాబ్ ట్రైలర్ అభిమానుల అంచనాలనాకు మరింతగా పెంచేసింది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఫౌజీ నుంచి ఈసారి రిలీజ్ డేట్ పోస్టర్ వస్తుంది అనే ప్రచారం ఉంది.
అదే అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కి సలార్ ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పట్టాలెక్కని స్పిరిట్, కల్కి 2, సలార్ 2 నుంచి ఏమైనా సర్ ప్రైజ్ ట్రీట్స్ ప్లాన్ చేసారేమో మేకర్స్ అనేది మరొక్క వారం లో తెలిసిపోతుంది.