బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి నుంచి ఆడియన్స్ కు క్యూట్ గా స్వీట్ గా కనెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే బుల్లితెర నటి తనూజ. కన్నడ గర్ల్ తనూజ ను బుల్లితెర ఆడియన్స్ ఎంతగా గుండెల్లో పెట్టుకున్నారు అంటే ఆమె నామినేషన్స్ లోకి వస్తే చాలు ఆమెకు ఫుల్ సపోర్ట్ చూపిస్తూ ఓట్లు గుద్దుతున్నారు.
హౌస్ లో అబ్బాయిలతో పోటీపడి ఆడుతున్న తనూజ ను వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి వహ్చిన అయేషా, ఇంకా మాధురి, రమ్యలు టార్గెట్ చేసారు. కళ్యాణ్ తో కలిసి తనూజ కంటెంట్ కోసం చూస్తుంది, అదే నేనైతే కాలికింద వేసి తొక్కుట అని రమ్య మోక్ష ఓవర్ చేస్తుంది. నాన్న అంటూ భరణి గారి ఆట పాడు చేస్తుంది, సీరియల్స్ లా ఏడుస్తూ అందరి సింపతీ కోరుకుంటుంది అంటూ తనూజ ను ఈ వారం నామినేషన్స్ లోకి పంపేశారు.
అయితేనేమి తనూజ కు ఆడియన్స్ ఎంతగా సపోర్ట్ ఉంది అంటే నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో తనూజాకి ఒక్కదానికే 35 శాతం ఓట్లు పడుతున్నాయి అంటే ఆమె నెంబర్ 1 స్థానంలో ఉంది అని అర్ధం, మరి సుమన్ శెట్టి మొదట్లో కాస్త జోష్ చూపించినా.. ఫైనల్ గా ఈవారం మాత్రం తనూజ కి ఆడియన్స్ నుంచి గట్టి సపోర్ట్ దొరికింది.