చిన్నారి పెళ్లి కూతురుగా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసి.. తర్వాత హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన అవికా గోర్ రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ మిలింద్ ఛధ్వాని ని వివాహం చేసుకుంది. మిలింద్-అవికా గోర్ లు ఓ టివి షో లో పెళ్లి చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అవడమే కాదు, అదే సోషల్ మీడియాలో ట్రోల్స్ కి దారి తీసింది. అవికా వెడ్డింగ్ లుక్ పై కూడా విమర్శలొచ్చాయి.
తాజాగా అవికా గోర్ తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ కి రియాక్ట్ అయ్యింది. తనకు చిన్నప్పటినుంచి ఓ టివి షో లో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది. అందుకే ఇలా చేసుకున్నాను, ఆ విషయం మిలింద్ తో చెప్పాను. మనం డబ్బు కోసమే ఇలా టివి షో లో పెళ్లి చేసుకుంటున్నారు అంటారాని మిలింద్ నాకు ముందే చెప్పాడు.
మిలింద్ ఒప్పుకోవడం నాకు ఇంపార్టెంట్. అంతేగాని జనాలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి ట్రోల్స్ వస్తాయనే విషయాన్ని నేను పట్టించుకోను. నా పెళ్లి మొత్తం సాంప్రదాయంగా జరిగింది. అందుకే నా పెళ్లి కూతురు లుక్ అలా ఉంది. అదే నా భర్త లుక్ పై విమర్శలొస్తే బాధపడేదాన్ని. కారణం నేనే మా ఆయన లుక్ డిజైన్ చేశాను అంటూ అవికా గోర్ పెళ్లి, అలాగే తన పెళ్లి లుక్ పై వచ్చిన విమర్శలకు రియాక్ట్ అయ్యింది.