ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం విచ్చేసారు. ఢిల్లీ నుంచి కర్నూల్ వరకు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన మోడీ అక్కడి నుంచి శ్రీశైలానికి స్పెషల్ హెలిఫ్యాడ్ లో వెళ్లారు. పీఎం మోడికి ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు ఘాన స్వాగతం పలికారు.
నరేంద్రమోడీ శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని కర్నూలు బహిరంగసభలో పాల్గొనడమే కాదు, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఓర్వకల్లు డ్రోన్ సిటీకి ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చెయ్యనున్నారు. అయితే ప్రధాని మోడీ రాక రాష్ట్రానికి పెట్టుబడుల రాక, విశాఖలో గూగుల్ కంపెనీ రాక, అలాగే సింగపూర్ లాంటి దేశాలు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు చూపిస్తున్న ఉత్సహం అన్నిటికి కలిపి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn! 🌶️🔥 #AndhraRising #YoungestStateHighestInvestment
ఆంధ్ర ఫుడ్స్ ఎంత స్పైసీగా ఉంటాయంటారో.. రాష్ట్రానికి వస్తోన్న పెట్టుబడులు అంతే స్పైసీగా ఉన్నాయి. పొరుగువారికి అప్పుడే మంట మొదలైంది.. అంటూ ఎక్స్ వేదికగా మినిస్టర్ నారా లోకేష్ చేసిన ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతుంది.