సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ప్రియదర్శి నటించిన మిత్రమండలి చిత్రం ఈ రోజు విడుదల కాబోతుండగా.. గత రాత్రి నుంచే ప్రీమియర్స్ అంటూ మేకర్స్ హడావిడి చేసారు. ప్రీమియర్స్ రిస్క్ అయినప్పటికి సాహసిస్తున్నాము అంటూ నిర్మాత బన్నీ వాస్ అన్నారు. సినిమా టాక్ ని బట్టి థియేటర్స్ ని పెంచుతామని నమ్మకం చూపించారు.
గత రాత్రి ప్రీమియర్స్ తో సందడి చేసిన మిత్రమండలి థియేటర్ టాక్ లోకి వెళితే.. కమెడియన్ గానే కాదు మెయిన్ కేరెక్టర్స్ లోను ప్రియదర్శి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. అయితే ప్రమోషన్స్ లో చెప్పినట్టుగా మిత్రమండలి కథలో స్పెషల్ ఏమి లేదు. చాలా సినిమాల్లో చూసిన రొటీన్ కథనే దర్శకుడు ఎంచుకున్నాడు. కులపిచ్చి, దానితో లాభపడాలనుకోవడం, కూతురు లేచిపోవడం, పరువు పోతుంది అంటూ సీక్రెట్ గా వెతకడం వంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసినవే.
నటులు ప్రియదర్శి అండ్ కో అంతగా ప్రభావం చూపలేకపోయారు, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు, సత్య కామెడీ తప్ప మిత్రమండలిలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవు. రొటీన్ స్టోరీ, రొట్ట కామెడీ, వీక్ డైరెక్షన్ అన్ని మిత్రమండలి చిత్రానికి మైనస్ లుగా మారాయి. ఈ టాక్ తో ఈ దివాళి రేస్ లో మిత్ర మండలి పెరఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం.