రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసారు. పెద్ది షూటింగ్ కూడా శరవేగంగా జరిగిపోతుంది. రామ్ చరణ్ గ్యాప్ లేకుండా బుచ్చిబాబు కి సహకరిస్తున్నాడు.
అయితే ఈమధ్యన పెద్ది చిత్రం మార్చ్ లో విడుదల కావడం ఇంపాజిబుల్, ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది కానీ మేకర్స్ మాత్రం పెద్ది మార్చి 27, 2026 అంటూ పదే పదే చెబుతున్నారు. తాజాగా మైత్రి మూవీ నిర్మాతలు మరోసారి పెద్ది చిత్రాన్ని మార్చి 27 అంటే అనుకున్న సమయానికే విడుదల చేస్తాము, అస్సలు తగ్గేదేలే అంటున్నారు.
ఈ దీపావళికి పెద్ది నుంచి ఫస్ట్ సింగిల్ ఇస్తారని, దసరా కి మిస్ అయిన పెద్ది సందడి దివాళి కి ఉంటుంది అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది. దర్శకుడు బుచ్చిబాబు కూడా పెద్ది సింగిల్ కి రెహమాన్ మ్యూజిక్ అద్దరగొట్టేసారు, త్వరలోనే సింగిల్ వదులుతామని గత రాత్రి ఓ ఈవెంట్ లో బిగ్ అప్ డేట్ ఇచ్చారు.