బిగ్ బాస్ సీజన్ 9 లో హౌస్ మేట్స్ కొట్లాడుకుంటున్నారు. దివ్వెల మాధురి, అయేషా లు ఓల్డ్ హౌస్ మేట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. అయేషా అయితే ఈ నామినేషన్స్ లో తనూజ పై నోరు పారేసుకుంది. దివ్వెల మాధురి అయితే దివ్య, రీతూ లను రెచ్చగొడుతుంది. ఇక గత రాత్రి ఎపిసోడ్ లో బొచ్చెల గోల బుల్లితెర ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.
నువ్వు గిన్నె కడగలేదు అంటే నువ్వు గిన్నె కడగలేదు అంటూ అయేషా, రీతూ లు పెద్ద పెద్దగా గొడవపడ్డారు. అయేషా చేసిన ఓవరేక్షన్ చూసిన వాళ్లకు వెగటు పుట్టించింది. ఆమె గొంతు బర్రె గొంతులా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తున్నారు. అసలు ఈ బొచ్చెల గోలేమిటో అర్ధం కావట్లేదు. బిగ్ బాస్ మీరు టాస్క్ లు పెట్టండి, అది బావుంటుంది అంటున్నారు.
ఇక రీతూ, కళ్యాణ్, పవన్ లు టాప్ 5 లో ఉండేందుకు వారి స్ట్రాటజీ వారు వాడుతున్నారు, మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నారు అని సాయి అనగానే అసలు వాళ్లకు మనమే అడ్డు అంటూ అయేషా అంది, అవును వైల్డ్ కార్డ్స్ వచ్ఛాక వాళ్ళు సేవ్ అయ్యేందుకు తెగ ఆరాటపడుతున్నారు అన్నారు.
తనూజాను కూడా రీతూ, పవన్, కళ్యాణ్ లు బయటకు పంపిస్తారు. వారిలో వారు తర్వాత గొడవపడతారంటూ కొత్త వైల్డ్ కార్డ్స్ డిస్కర్షన్స్ గత రాత్రి ఎపిసోడ్ లో వినిపించాయి.