Advertisement
Google Ads BL

దివాళి ఫైట్: ఏ హీరో గెలుస్తాడు


ఈ దీపావళికి యువ హీరోల నడుమ క్రేజీ ఫైట్ మొదలవ్వబోతుంది. కుర్ర హీరోలు మీడియం బడ్జెట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దివాళి లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు నువ్వా-నేనా అని పోటీ పడుతున్నారు. అందులో ముందుగా ప్రియదర్శి మిత్రమండలి అంటూ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రేపు గురువారమే ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. 

Advertisement
CJ Advs

మిత్రమండలి కంటెంట్ పై నమ్మకంగా ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ను షురూ చేసారు మేకర్స్. తర్వాత శుక్రవారం సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా చిత్రంతో రాబోతున్నాడు. హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి తో ఈ హీరో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మరోపక్క K-ర్యాంప్ అంటూ కిరణ్ అబ్బవరం ఈ దివాళీని టార్గెట్ చేస్తున్నాడు. 

గత ఏడాది క మూవీ తో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈఏడాది K -ర్యాంప్ తో సక్సెస్ సాధించేందుకు రెడీ అయ్యాడు. ఈసారి K-ర్యాంప్   చిత్రంతో ఈ దీపావళిని టార్గెట్ చేసాడు. తెలుగు హీరోలకు పోటీగా డ్యూడ్ ని ప్రమోట్ చేస్తున్నాడు తమిళ్ హీరో ప్రదీప్ రంగనాధన్. అయితే ఈ చిత్రాలు అన్ని వేటికవే ప్రత్యేక జోనర్స్ లో తెరకెక్కినవే. 

ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్స్ తెచ్చుకుని ఫుల్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ దగ్గరకు వచ్చేందుకు ఈ నలుగురు హీరోలు సర్వం సిద్ధమయ్యారు. మరి దీపావళి హీరో గా ఏ హీరోకి ఛాన్స్ ఇస్తారో ప్రేక్షకులు అనేది మరో రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. 

Diwali Packed With New Releases:

Diwali Releases A Weekend of Entertainment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs