బిగ్ బాస్ సీజన్ 9 లో ఫైర్ స్ట్రోమ్ అంటూ ఫైర్ ఉన్న కంటెస్టెంట్స్ వస్తారు అనుకుంటే.. పొలిటికల్ గా ఫేమస్ అయిన దివ్వెల మధురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకురావడం చాలామందికి నచ్ఛలేదు. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి కొత్త పెళ్లి కూతురులా ఆమె తిరగడం చాలామందికి రుచించ లేదు.
ఇక హౌస్ లోకి అడుగుపెట్టాక ఆమె చీటికీ మాటికీ నోరేసుకుని ఇతర కంటెస్టెంట్స్ పై పడిపోతుంది. వంట దగ్గర ఫుడ్ మోనిటర్ దివ్య తో గొడవ పెట్టుకుంది. స్టిక్కర్స్ కోసం సంజనతో యుద్ధం చేస్తుంది. ఇక లైట్ ఆపేసాక బెడ్ రూమ్ లో ఎవరూ మట్లాడకూడదు, గుడ్ మార్నింగ్ సాంగ్ వచ్చేవరకు సైలెంట్ గా ఉండాలి అంటూ హౌస్ మేట్స్ తో అనగానే రీతూ మీరెవరు చెప్పడానికి మీరు బిగ్ బాస్ ఆ అంటూ ఫైర్ అయ్యింది.
దానితో నాకు నా హెల్త్ ఇంపార్టెంట్, మీరు కిలకిలా నవ్వుతుంటే నాకు నిద్ర పట్టడం లేదు, డిస్టర్బ్ అవుతుంది అంటూ గొంతెసుకుని అరిచెయ్యడం, ఇలా అరిస్తే కూడా మీ హెల్త్ పాడవుతుంది అంటూ రీతూ కూడా కాస్త గట్టిగానే దివ్వెల మాధురి తో ఫైట్ చేసింది.
హౌస్ లో దివ్వెల మాధురి గొడవలు చూసిన జనాలు ప్లీజ్ బిగ్ బాస్ దివ్వెల మధురిని త్వరగా పంపెయ్యండి, నాగార్జున సర్ దివ్వెల మాధురిని ఎలిమినేట్ చేసెయ్యండి సర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆమెని హౌస్ లో ఎంత కాలం భరించాలో అంటూ బిగ్ బాస్ కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.