చాలామంది హీరోయిన్లు కెరీర్ లో ప్లాప్ లు వహ్చినప్పుడు చూస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళడము, లేదంటే పర్సనల్ గా ఇబ్బందులు పాలవడమూ చూస్తుంటాము, కొంతమంది కుటుంబం పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. తాజాగా హీరోయిన్ హన్సిక అటు తాళి బందంలోనూ, అటు తమ్ముడు భార్య పెట్టిన కేసు వ్యవహారంలోనూ తన పేరెంట్స్ తో సహా సతమతమవుతుంది.
సోహైల్ అనే బిజినెస్ మ్యాన్ ను హన్సిక ప్రేమించి మరీ అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అటు కెరీర్ డల్ అవడం ఇటు వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడంతో హన్సిక తన భర్త నుంచి విడిగా.. తల్లితో కలిసి సపరేట్ గా ఉంటుంది.
ఈలోపే తమ్ముడు భార్య తనపై పేరెంట్స్ పై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసులో హన్సిక సఫర్ అవుతూ షూటింగ్స్ కి దూరమైంది. తాజాగా ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మళ్ళీ పనిలో పడాలని, అందుకే ఇకపై హన్సిక్ కెరీర్ పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నట్లుగా సన్నిహితులకు చెబుతుందట. వీలైనంత తొందరగా ఆమె అందులో నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తుంది.
దానిలో భాగమే రీసెంట్ గా ఆమె స్నేహితులతో కలిసి లాంగ్ వెకేషన్ కి వెళ్లి రిలాక్స్ అయ్యి వచ్ఛినట్లుగా టాక్ వినబడుతుంది.