సెప్టెంబర్ 15 మెగా హీరో సాయి దుర్గ తేజ్ బర్త్ డే. రిపబ్లిక్, విరూపాక్ష చిత్రాల తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని ఆచి తూచి సాయి తేజ్ చేస్తున్న చిత్రం సంబరాల యేటి గట్టు. రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి సాయి తేజ్ బర్త్ డే స్పెషల్ గా గ్లింప్స్ వదిలారు.
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ మాస్ లుక్ లో అద్దరగొట్టేసారు. ఫిట్ నెస్ కి ఫిట్ నెస్, లుక్ కి లుక్ అన్నిటిట్లో సాయి తేజ్ సంబరాల యేటి గట్టులో అభిమానులు మెచ్చేలా కనిపించాడు. అసురుడు వచ్చేశాడు.. యుద్ధం తెచ్చేసాడు అంటూ సాయి తేజ్ చెప్పిన డైలాగ్ గ్లింప్స్ లో హైలెట్ అయ్యింది.
హ్యాపీ బర్త్ డే Bali అంటూ సాయి ధరమ్ తేజ్ కి సంబరాల యేటి గట్టు మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ గ్లింప్స్ లో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్ గా ఉన్నాయి. మెగా హీరో బర్త్ డే కి పర్ఫెక్ట్ విషెస్ లా ఈ గ్లింప్స్ ఉన్నాయంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.