రకుల్ ప్రీత్ సింగ్ మొదటి నుంచి గ్లామర్ గర్ల్ గానే కనిపించినా.. ఆమెకు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఛాన్స్ లు రావడంతో కొన్నేళ్లు టాలీవుడ్ లో చక్రం తిప్పింది. సౌత్ లో కేవలం ఒకరిద్దరు స్టార్స్ తో తప్ప మిగతా స్టార్ హీరోలందరితో రకుల్ ప్రీత్ నటించింది. కానీ మహేష్ స్పైడర్ దెబ్బ రకుల్ కి గట్టిగా తగిలింది.
తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయినా రకుల్ కి అక్కడ సీనియర్ హీరోలు తప్ప కుర్ర హీరోలెవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. ఆ సినిమాలు కూడా రకుల్ ప్రీత్ ని డిజప్పాయింట్ చేసినవే. రకుల్ కి చెప్పాలంటే హిందీలో ఒక్క హిట్ కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో భీబత్సమైన గ్లామర్ షో చేస్తుంది.
సోషల్ మీడియాలో గ్లామర్ షో ని నమ్ముకుని బాలీవుడ్ ఆఫర్స్ పట్టేస్తున్న రకుల్ తాజాగా అజయ్ దేవగన్ తో నటించిన దేదే ప్యార్ దే 2 ట్రైలర్ లంచ్ లో ఆరబోసిన అందాలు చూస్తే అమ్మో రకుల్ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నావా అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రెడ్ ఫ్రాక్ లో రకుల్ గ్లామర్ షో వేరే లెవల్ అంటే నమ్మాల్సిందే.