బిగ్ బాస్ సీజన్9 లో గత వారం డబుల్ ఎలిమినేషన్ లో బయటికెళ్లిన శ్రీజ దమ్ము ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రెండు వారాల్లో ప్రియా తో కలిసి నోరేసుకుని పడిపోయిన శ్రీజ గత రెండు వారాల్లో టాస్క్ పెరఫార్మెన్స్ లో అద్భుతంగా ఆడింది. ప్రియా వెళ్లిన తర్వాత వారం శ్రీజ ను పంపేయాలనుకున్న బుల్లితెర ప్రేక్షకులు ఆమె ఆట తీరు చూసి ఆమెకు ఓట్ చేసి సపోర్ట్ చేసారు.
కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ లతో శ్రీజ ను ఎలిమినేట్ చేయించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే శ్రీజ ను ఎలిమినేట్ చేసారు, దివ్వెల మాధురి తన పేరు తెలియదని శ్రీజ చెప్పినందుకే అలా ఎలిమినేట్ చేసారు. అది అన్ ఫెయిర్ అంటూ బిగ్ బాస్ రివ్యూయర్స్ చెబుతున్నారు. శ్రీజ దమ్ముని అనవసరంగా ఎలిమినేట్ చేసారు, ఆమె టాస్క్ అయినా, మిగతా విషయాల్లో అయినా చాలా బాగా బిహేవ్ చేస్తుంది.
హోస్ట్ నాగార్జున కూడా రెండు వారాలుగా శ్రీజ ను మెచ్చుకుంటున్నారు. దమ్ము శ్రీజ ను ఉంచాలని బుల్లితెర ప్రేక్షకులు ఓట్లు వేశారు. కానీ ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీలతో టాస్క్ లు ఆడించి అందులో కావాలనే ఓడిపోయేలా చేసి ఆమెను ఎలిమినేట్ చేసారు. అది కరెక్ట్ కాదు, దమ్ము శ్రీజ ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలోనే దారుణమైన ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.