అవును రాశి ఖన్నా కి తెలుగులో ఒక్క హిట్ ప్లీజ్. కొన్నాళ్లుగా టాలీవుడ్ లో అవకాశాలు లేని ఈ హాట్ బ్యూటీ కి సిద్దు తెలుసు కదా చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందు రాబోతుంది. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి చేసిన సినిమా తెలుసు కదా.
ఈ చిత్రంలో రాశి ఖన్నా శ్రీనిధి శెట్టి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. రాశి ఖన్నా తెలుసు కదా ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తుంది. తెలుసు కదా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా గ్లామర్ షో వేరే లెవల్ అనేలా ఉంది. అందుకే ఆమె గ్లామర్ షో పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు.
తెలుసు కదా ప్రమోషన్స్ లో భాగంగా దివాళి బుల్లితెర స్పెషల్ ప్రోగ్రామ్స్ లో రాశి ఖన్నా, శ్రీనిధి లు పాల్గొంటున్నారు. కానీ రాశి ఖన్నా గ్లామర్ షో మాత్రమే తెగ హైలెట్ అవుతుంది. మరి ఈ బ్యూటీ కి తెలుసు కదా హిట్ అత్యంత అవశ్యం. ఆతర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తో అమ్మడు లక్ టెస్ట్ చేసుకోవాలి.