బలగం వేణు కష్టాలు అన్నా, ఇన్నా. బలగం హిట్ తర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ కి సమయం కేటాయించి కథను ప్రిపేర్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటుగా హీరోని సెలక్ట్ చేసుకుని ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేస్తే.. ఆ హీరో ఎల్లమ్మ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని వేణుకి ఫస్ట్ షాక్ ఇచ్చాడు. హీరో నాని తో ఎల్లమ్మ అనుకున్న వేణుకి నాని తప్పుకోవడం పెద్ద షాకే.
ఆతర్వాత దిల్ రాజు నితిన్ ని తీసుకొచ్చి వేణు కి అప్పగించాడు. తమ్ముడు తర్వాత నితిన్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చెయ్యాల్సి ఉంది. తమ్ముడు నితిన్ కి డిజాస్టర్ ఇవ్వడంతో నితిన్ కూడా మెల్లగా ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడు. ఆతర్వాత శర్వానంద్ పేరు వినిపించింది.
ఇప్పుడు శర్వా బదులు బెల్లంకొండ శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ఇంకా ఆ ప్రచారం జరుగుతుండగానే వేణు ఎల్లమ్మకి మరో కష్టం వచ్చి పడింది. ఈ సినిమాకి ముందు ఎల్లమ్మ పాత్రకి సాయి పల్లవి ని అనుకుని.. తర్వాత కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఎల్లమ్మ నుంచి తప్పుకుంది అని వార్తలొస్తున్నాయి.
ఎల్లమ్మ ప్రాజెక్ట్ మొదలు కాకముందే ఇన్ని జరుగుతుంటే.. మొదలయ్యాక సజావుగా సాగుతుందా అనే అనుమానాలు ఆడియన్స్ లో మొదలయ్యాయి.