స్టార్ మా సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ పిల్ల తనూజ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోను ఆడియన్స్ నుంచి బాగా సపోర్ట్ అందుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజ క్యూట్ అండ్ స్వీట్ గా టాస్క్ పెరఫార్మెన్స్ మాత్రమే కాదు, ఆమె నవ్వినా, మాట్లాడినా అన్నిటిలో తనూజాను ఇష్టపడుతున్నారు.
కాకపోతే తనూజ భరణి ని నాన్న అంటూ దివ్య విషయంలో పొసెసివ్ గా ఉంటూ టాస్క్ ల్లో వెనకబడింది, కళ్యాణ్ ని నమ్మి మోసపోతుంది అనే బాధ ఆడియన్స్ లో కనిపిస్తుంది. గత వారం నామినేషన్స్ లోకి వచ్చిన తనూజా ను ఆడియన్స్ సపోర్ట్ చేసారు, కానీ ఓటింగ్ లేకుండానే కష్టపడి టాస్క్ ఆడి సేఫ్ జోన్ లో నిలుచుంది.
ఇక ఈవారం కూడా తనూజ ను హౌస్ మేట్స్ నామినేట్ చేసారు. సోమవారం నైట్ తనూజాను నామినేట్ చేసినట్లు ఎపిసోడ్ లో చూపించకపోయినా లీకులు తనూజ నామినేషన్స్ లోకి వచ్చినట్టుగా చెప్పేసాయి. దానితో తనూజాను ఆడియన్స్ సపోర్ట్ చేస్తూ ఓట్ చెయ్యడం మొదలెట్టేసాడు.
నామినేషన్స్ లో సుమన్ శెట్టి తర్వాత తనూజనే ఓటింగ్ లో టాప్ లో కనిపిస్తుంది. ఆడియన్స్ ఇష్టపడబట్టే కాదా తనూజాకు ఓట్స్ పడుతున్నాయని అంటున్నారు.