బోయపాటి - బాలకృష్ణ కలయికలో సినిమా అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అనేది చెప్పడం కంటే సోషల్ మీడియాలో చూడడమే బెటర్. ప్రస్తుతం వీరి కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం పై ఎంతగా అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 5 కి పోస్ట్ పోన్ అయిన అఖండ 2పై భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే అఖండ 2 పై ఉన్న క్రేజ్ తో ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో ప్లస్ హాట్ స్టార్ రూ.85 కోట్లకు దక్కించుకుందని తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ లోనే దుమ్మురేపిన అఖండ తాండవం ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ లోను సత్తా చాటింది. అఖండ తాండవం విడుదల కాబోయే పాన్ ఇండియా భాషలకు కలిపి శాటిలైట్ డీల్ జరిగినట్టుగా తెలుస్తుంది.
అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్‌ని స్టార్ టీవీ రూ.65 కోట్లకు సొంతం చేసుకుందని తెలుస్తుంది. థియేట్రికల్ రైట్స్ కాకూండా కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ చిత్రం రూ.145 కోట్లు రాబట్టింది. మరి ఇది బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు.
అఖండ 2 విడుదలకు ముందే రికార్డ్ లు కొల్లగొడుతుంది. విడుదలయ్యాక భారీ కలెక్షన్స్ తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో జస్ట్ వెయిట్ అండ్ సి.