హిందీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2 చిత్రం ఏప్రిల్ 14 న భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ ఆడియన్స్ అంచనాలు, అభిమానుల అంచనాలను అందుకోవడం లో వార్ 2 పూర్తిగా విఫలమయ్యింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం, VFX అన్ని వార్ 2 ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాయి.
హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబో సీన్స్, యాక్షన్ సన్నివేశాలు బావున్నా వార్ 2 మాత్రం థియేటర్స్ లో సో సో గా మిగిలిపోయింది. రీసెంట్ గా అంటే అక్టోబర్ 9 న నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన వార్ 2 చిత్రం ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అయితే ఉత్సాహపడేలా చేసింది. కారణం వార్ 2 వలన ఎన్టీఆర్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసారు.
తాజాగా ఆర్మాక్స్ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్ 6 నుండి 12 వరకు ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా వార్ 2 నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో వార్ 2 చిత్రం మొత్తం 3.5 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మరి థియేటర్స్ లో ప్లాప్ అయిన వార్ 2 ఓటీటీ లో బ్లాక్ బస్టర్ హిట్ అవడం మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు కాస్త రిలీఫ్ నిచ్చింది అనే చెప్పాలి.