బిగ్ బాస్ హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ అంటూ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ రమ్య హౌస్ లో తెగ యాటిట్యూడ్ చూపిస్తుంది. జిమ్ బాడీ వేసుకుని చీరకట్టి మగరాయుడిలా తిరుగుతున్న రమ్య ఇంతకుముందు ఉన్న హౌస్ మేట్స్ పై తెగ కామెంట్స్ చెయ్యడమే కాదు తనూజ-కళ్యాణ్ లపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది.
దివ్వెల మాధురి తో కలిసి కూర్చుని కళ్యాణ్ తనూజ తో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడు, తనూజ ను లవ్ ట్రాక్ లో దింపుతున్నాడు, అమ్మాయిల పిచ్చి కళ్యాణ్ కి అని అంటే.. సోల్జర్ కి అమ్మాయిల పిచ్చెమిటో అంటూ మాధురి మట్లాడడం, తనూజ కూడా అటువైపు నుంచి సహకరిస్తుంది, కాబట్టే కళ్యాణ్ తనూజ వెంట పడుతున్నాడు. చేతులు మీద వేసి మాట్లాడుతున్నాడు.
అలా నాపై చెయ్యి వేసి మాట్లాడితే తాట తీస్తాను, కొడతాను అంటూ ఓవర్ గా మాట్లాడుతుంది రమ్య. బిగ్ బాస్ హౌస్ లో రమ్య యాటిట్యూడ్ చూసి బయట బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్ళు రమ్య ని ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు. రమ్య అతి చేస్తుంది. కళ్యాణ్-తనూజ కలిసి ఉంటే నీకేంటి బాధ. చూసేవాళ్ళం మాకు లేని బాధ నీకేంటి.. నీ దగ్గరకు కళ్యాణ్ రాడు, అందుకే నీకంత కుళ్ళు అంటూ రమ్యపై రెచ్చిపోయి రివ్యూస్ ఇస్తున్నారు.