Advertisement
Google Ads BL

ఎల్లమ్మకు ఈ హీరోని ఫైనల్ చేశారా


బలగం సినిమా తర్వాత వేణు చేయాల్సిన ఎల్లమ్మ సినిమా విషయంలో హీరోలు మారుతూనే ఉన్నారు. ముందుగా నేచురల్ స్టార్ నాని అని అనుకున్నారు. కానీ, నాని ఈ సినిమాకు నో చెప్పాడనేలా టాక్ నడిచింది. ఆ తర్వాత అతని ప్లేస్‌లోకి నితిన్ వచ్చి చేశారు. కానీ నితిన్ చేసిన తమ్ముడు సినిమా వర్కవుట్ కాకపోవడంతో సడెన్‌గా ఆ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడింది. ఈ సినిమాకు దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్ అవుతుందనే క్రమంలో.. నితిన్‌తో ఈ సినిమా అంత సేఫ్ కాదని దిల్ రాజు ఆలోచనలో పడ్డారు.

Advertisement
CJ Advs

ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం తేజ సజ్జాను కూడా సంప్రదించినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, తేజాకు ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమాలో చేయడానికి ఆయన వెనకడుగు వేయడంతో.. మరో హీరో కోసం వేట మొదలు పెట్టారు. ఫైనల్‌గా ఈ సినిమాకు హీరోను ఓకే చేసినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అని తెలుస్తుంది. 

రీసెంట్‌గా వచ్చిన కిష్కింధపురి సినిమాతో సక్సెస్‌ను అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను ఎల్లమ్మ సినిమాకు హీరోగా ఫైనల్ చేశారని, త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసి, షూటింగ్‌కు వెళ్లబోతున్నారట. మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు.. ఇకపై బెల్లంకొండ పేరే ఈ సినిమాకు వినిపిస్తుంది. చూద్దాం.. బెల్లంకొండ బాబుతో అయినా ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళుతుందో.. లేదో.. 

Bellamkonda Sai Sreenivas Finalized as Hero for Venu Yellamma:

After Nani, Nithiin, and Teja Sajja, Yellamma Locks Bellamkonda Sai Sreenivas as Lead
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs