సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ ని ఎప్పుడు మొదలు పెడతారా అని ఈ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ వచ్చిన రోజు నుంచి అభిమానులు వెయిట్ చెయ్యని క్షణం లేదు. కానీ ప్రభాస్ డేట్స్ ఇవ్వలేదో, సందీప్ వంగ ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చెయ్యలేదో స్పిరిట్ సెప్టెంబర్ లో కూడా మొదలు కాలేదు. ఈ ఏడాది చివరి నుంచి స్పిరిట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.
స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ అధికారిగా పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తారని సందీప్ రెడ్డి వంగ చెప్పారు. అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ను పోలీస్ కేరెక్టర్ లో ఎలా ఉంటారో అని ఊహించేసుకుని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేస్తూ.. Ee look tho #Spirit lo backstory unte inka antheyyy #Prabhas అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ లుక్ ని షేర్ చేసారు.
రాయల్ గా సోఫాలో కూర్చున్న ప్రభాస్ మాసివ్ లుక్ కి అభిమానులు ఫిదా అవ్వబట్టే సందీప్ ని అలా కోరుతున్నారు. ఈ చిత్రంలో ముందుగా దీపికా ను హీరోయిన్ గా అనుకుని ఇప్పుడు ఆమె ప్లేస్ లో తిప్తి డుమ్రి ని తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన మూడేళ్లకు సెట్ పైకి వెళ్లే అవకాశం ఈఏడాది చివరిలో రావొచ్చని సమాచారం.