గత రెండేళ్లుగా సినిమాల్లో కనిపించను లేదు, సినిమా లకు గ్యాప్ ఇచ్చింది, అయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్. బయట కనిపించింది అంటే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆమె ఎవరో కాదు సమంత. ప్రస్తుతం సమంత సినిమాలు చెయ్యడం లేదు, అనారోగ్య కారణాలతో షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చింది.
సినిమాలు చెయ్యకపోయినా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్న సమంత రాజ్ నిడమోరు తో డేటింగ్ విషయంలో మాత్రం నిత్యం వార్తల్లోనే కనబడుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో గ్లామర్ షో తో ట్రెండ్ అవుతుంది. అందాలు ఆరబోసేందుకు వెనుకాడని సమంత ను గూగుల్ లోను తెగ వెతికేస్తుంటారు.
తాజాగా ఆమె బెంగుళూరులో ఓ ఈవెంట్ కి హాజరయ్యింది. ఆ ఈవెంట్ లో చాలా ట్రెడిషనల్ గా చుడిదార్ లో సమంత కనిపించింది. అయినప్పటికి సమంత ఈవెంట్ ఫొటోస్ ని ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. సమంత ఎక్సప్రెషన్స్ ని ట్రెండ్ చెయ్యడం చూసి సినిమాలకు బ్రేకిచ్చినా ఎందుకింత క్రేజ్ రా బాబు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.