దర్శకుడు సందీప్ వంగ స్పిరిట్ నుంచి దీపికా పదుకొనె ని తప్పించి వెంటనే త్రిప్తి డుమ్రి ని స్పిరిట్ హీరోయిన్ గా అనౌన్స్ చేసారు. కొద్ది రోజులకు ప్రభాస్ మూవీ కల్కి సీక్వెల్ నుంచి దీపికా ను మేకర్స్ తప్పించడం సెన్సేషన్ అయ్యింది. ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుంచే దీపికా ను బ్యాక్ టు బ్యాక్ తప్పించడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే కల్కి 2 షూటింగ్ ఇంకా మొదలు కాకుండా దీపికా పదుకొనెను ఉన్నట్టుండి తప్పించడం అందరికి ముఖ్యంగా దీపికా అభిమానులకు షాకిచ్చింది. అయితే కల్కి 2 లోకి దీపికా స్థానంలోకి వచ్చే హీరోయిన్ విషయంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ముఖ్యంగా అలియా భట్, సాయి పల్లవి పేర్లు వినిపించాయి.
తాజాగా దీపికా చెయ్యాల్సిన కల్కి 2 పాత్రను అలియా భట్ చేస్తుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఫైనల్ గా కల్కి 2 కి అలియా ఉంటుందో.. లేదంటే మరెవరన్నా వస్తారో అనేది చూడాలి.