బిగ్ బాస్ సీజన్ 9 లో ఐదోవారం లో హౌస్ మేట్స్ మొత్తం ఎవరూ బద్దకించకుండా టాస్క్ లన్నిటిలో సూపర్ పెరఫార్మెన్స్ ఇచ్చారు. సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి, రీతూ, తనూజ, దివ్య, శ్రీజ లు కూడా అబ్బాయిలతో పోటీపడి బెస్ట్ అనిపించారు. ఈ వారంలో భరణి, దివ్య, ఇమ్మాన్యువల్, రాము, తనూజ, కళ్యాణ్ లు సేఫ్ జోన్ లో ఉన్నారు.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఫ్లోరా, సంజన, శ్రీజ, సుమన్ శెట్టి, పవన్, రీతూ లు ఉన్నారు. అయితే ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఫ్లోరా షైనీ ముందుగా ఎలిమినేట్ అయ్యింది. ఆమె కామ్ గా ఎవరి విషయాల్లో తలదూర్చకుండా ఉంటుంది. సంజన తో ఫ్లోరా ఫ్రెండ్ షిప్ ఆమెను కాపాడింది. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో బయటికెళ్ళిపోయింది.
ఇక డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. నిన్నటివరకు రీతూ డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ.. గత వారం హరిత హరీష్ ఎలిమినేట్ అవడంతో సేవ్ అయిన కామన్ మ్యాన్ శ్రీజ ఈ వారం ఎలిమినేషన్ లోకి రావడమే ఇంటికెళ్ళిపోయింది. రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయిన ప్రియా వెనుకే శ్రీజ వెళ్ళిపోతుంది అనుకున్నా హరిత హరీష్ ఎలిమినేట్ అవడంతో శ్రీజ మరో వారం హౌస్ లో ఉండగలిగింది.
శ్రీజ కి వాయిస్ ఎక్కువ బలం తక్కువ అన్నట్టుగా కామన్ మ్యాన్ కోటాలో శ్రీజ ఈ వారం ఇంటికెళ్లాల్సి వచ్చింది.