అల్లు అర్జున్ పుష్ప సీరీస్ తో నేషనల్ హీరో అయ్యాడు. పుష్ప సక్సెస్ ని కంటిన్యూ చెయ్యడానికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో క్రేజీ గా AA 22 ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. ఇంటర్నేషనల్ లెవల్లో AA 22 అనౌన్సమెంట్ ఇచ్చిన ఈప్రాజెక్టు కి సంబందించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు అట్లీ.
షూటింగ్ కి కాస్త విరామం రావడంతో బన్నీ భార్య తో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయాడు. అయితే AA 22 చిత్రానికి అల్లు అర్జున్ కళ్ళు చెదిరే కాదు కాదు సెన్సేషనల్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడనే న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని మించిన పారితోషికం అల్లు అర్జున్ అందుకోబోతున్నాడట.
AA 22 కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట, ఈ ప్రాజెక్ట్ 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది అంటున్నారు. అందులో 250 కోట్ల బడ్జెట్ ని VFX కోసం కేటాయిస్తారని అంటున్నారు. అలాగే బన్నీ కి 175 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. సో అల్లు అర్జున్ AA 22 కోసం సెన్సేషనల్ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నాడన్నమాట.