పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 9 న ప్రభాస్-మారుతి ల రాజా సాబ్ పొంగల్ స్పెషల్ గా విడుదల కాబోతుంది. ఈచిత్ర ప్రమోషన్స్ ను మారుతి అండ్ టీమ్ ఎప్పుడో మొదలు పెట్టేసింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి తో ఫౌజీ ని రెడీ చేస్తారు.
ఇప్పటికే 50 శాతం పైగా ఫౌజీ షూటింగ్ ని ప్రభాస్ ఫినిష్ చేసారు. ప్రస్తుతం రాజా సాబ్ పాటల చిత్రీకరణ కోసం ప్రభాస్ యూరప్ వెళ్లారు. అక్కడి నుంచి రాగానే హైదరాబాద్ లోనే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ షూట్ లో ప్రభాస్ జాయిన్ అవుతారు. ఈ ఏడాది చివరి నుంచి ప్రభాస్ సందీప్ వంగ తో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ కి హాజరయ్యే అవకాశం ఉంది.
ఇకపోతే ప్రభాస్ - హను ల ఫౌజీ షూటింగ్ 25 రోజుల పాటు టాకీ అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే తెరకెక్కించాల్సి ఉంది అని, ఈ చిత్రాన్ని హను రాఘవపూడి వచ్చే ఏడాది అంటే 2026 ఆగష్టు లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారనే టాక్ వినబడుతుంది. ఈ లెక్కన జనవరిలో రాజా సాబ్.. ఆగష్టు లో ఫౌజీ రిలీజ్ అంటే.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆరు నెలలకో పండగన్నమాట.