Advertisement
Google Ads BL

8 గంటల వర్క్ పై దీపికా రియాక్షన్


బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె వరసగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటుంది. దర్శకుడు సందీప్ వంగ దీపికా పదుకొనె కండిషన్స్ ను ఒప్పుకోకుండా ఆమెని స్పిరిట్ నుంచి తప్పించడం ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో చూసారు. ఆ సమయంలోనే దీపికా 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తాను, అలాగే తనకు ఇంత పారితోషికం కావాలని డిమాండ్ చేయడంతోనే సందీప్ వంగ ఆమెను స్పిరిట్ నుంచి తప్పించారు 

Advertisement
CJ Advs

అదే కారణంగా కల్కి 2898 AD మేకర్స్ కూడా దీపికా పదుకొనె ను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. తాజాగా దీపికా పదుకొనె 8 గంటల పనిగంటలపై రియాక్ట్ అయ్యింది. ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే వాటిని నేను ఏ మాత్రం అంగీకరించను. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో చాలామంది సూపర్ స్టార్లు, స్టార్ హీరోలు ఎన్నోఏళ్లుగా 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తున్నారు. ఇదేం సీక్రెట్ కాదు. అందరికి తెలిసిన విషయమే. 

కానీ ఇదెప్పుడు హైలెట్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ల పేర్లు బయటపెట్టలేను. చాలామంది అగ్ర హీరోలు 8 గంటలే పని చేస్తారని అందరికీ తెలుసు. వారిలో కొంతమంది వీక్ డేస్ లోనే అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షిఫ్ట్ ల వారీగా షూటింగ్స్ లో పాల్గొంటారు. వీకండ్స్ లో వర్క్ చెయ్యరు అంటూ దీపికా పదుకొనె తాను చేసిన కామెంట్స్ పై మరోసారి స్టాండ్ తీసుకుంది. 

Deepika Padukone breaks silence on row over 8-hour shift:

Deepika Padukone has finally broken her silence over her demand for an 8-hour shift
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs