అక్కినేని కోడలిగా నాగార్జున ఇంట అడుగుపెట్టిన శోభిత దూళిపాళ్ల కోడలి బాద్యతను నిర్వర్తిస్తూనే అటు కెరీర్ లోను బిజీగా మారుతుంది. భర్త నాగ చైతన్య తో కలిసి వీకెండ్స్ స్పెండ్ చేస్తూ షూటింగ్స్ నిమిత్తం ముంబై లో ఉంటున్న శోభిత గ్లామర్ కు ఎంత ఇంపోర్టన్స్ ఇస్తుందో.. ఆధ్యాత్మికతకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది.
సోషల్ మీడియాలో అందాలు ఆరబోసేలా రెడీ అయ్యి గ్లామర్ ఫొటోస్ ను షేర్ చేస్తుంది. తాజాగా వదిలిన బ్లాక్ టాప్ పిక్ చూస్తే వావ్ అనాల్సిందే. సోఫా పై శోభిత కనిపించిన తీరు మెస్మరైజ్ చేస్తుంది. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ తో ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్ లో శోభిత క్యూట్ గా కనిపిస్తుంది.
తనకు భార్యే ప్రపంచం అనేలా శోభిత ను నాగ చైతన్య ఆరాధించడంలో శోభిత పై చైతు కి ఎంత ప్రేమ ఉందొ ఈమధ్యనే ఓ షో లో చైతు చెప్పాడు కూడా. మరి ఈ జంట ఎప్పటికి ఇలానే ఉండాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.