కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార 22 ఏళ్ళ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ 22 ఏళ్ళ కెరీర్ లో నయనతార ఎన్నో ఎత్తుపల్లాలను, ఎన్నో సక్సెస్ లను, ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొంది. పర్సనల్ లైఫ్ లోను, కెరీర్ లోను నయనతార సతమతమైనా మళ్ళీ నిలదొక్కుకుని నిలబడింది.
తన 22 ఏళ్ళ కెరీర్ పై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ భావోద్వేగానికి గురైంది నయనతార. కెమెరా ముందుకు వచ్చి 22 ఏళ్లు గడిచిందని చెబుతూ.. నేను అనుకోకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టాను. అసలు సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఊహించలేదు. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ నన్ను నిలబెట్టాయి, అదే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. అవే నన్ను నేనేంటో తెలుసుకునేలా చేశాయి..
అంటూ తన సినీ ప్రయాణంలో తనకి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నయనతార ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం నయనతార తెలుగులో మెగాస్టార్ చిరు తో మన శంకర్ వర ప్రసాద్ గారు చిత్రంలో నటిస్తుంది.