బిగ్ బాస్ సీజన్ 9 లోఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. మూడో వారం మొదట్లో దివ్య అనే కామన్ మ్యాన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఐదో వారంలో నలుగురు వైల్డ్ కార్డ్స్ రాబోతున్నట్టుగా బిగ్ బాస్ హింట్ ఇవ్వడంతో హౌస్ మేట్స్ గుండెల్లో రాయి పడింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ గా ఉన్న రాము, ఇమ్యూనిటితో ఇమ్ము తప్ప మిగతా వాళ్ళంతా నామినేషన్స్ కు వచ్చేసారు. కానీ టాస్క్ లతో డేంజర్ జోన్ నుంచి బయటపడేందుకు వైల్డ్ అవతారమెత్తారు కంటెస్టెంట్స్.
ఈ వారం టాస్క్ ల్లో పవన్, రీతూ, సంజన, భరణి, దివ్య వీళ్లంతా దుమ్మురేపాడు, కానీ వరెస్ట్ కంటెస్టెంట్స్ గా కళ్యాణ్, సుమన్
భరణి, తనూజ, రీతూ, పవన్, సంజన, ఫ్లోరా, శ్రీజ, కళ్యాణ్, సుమన్ శెట్టి వీళ్లంతా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే సంజన, సుమన్ శెట్టి నామినేషన్స్ కి వస్తే వాళ్లకు బయట హైయ్యెస్ట్ ఓట్స్ పడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం నామినేషన్స్ లోకి వచ్చిన కన్నడ పిల్ల తనూజ ఓటింగ్ లో దూసుకుపోవడం అందరికి షాకిచ్చింది.
హౌస్ లో చక్కగా ఉంటూ భరణి ని నాన్న అంటూ, కాస్త నోరేసుకుపడిపోయే తనూజ ను చాలామంది ఇష్టపడుతున్నారు. ఆతర్వాత స్థానంలో ఓటింగ్ లో అనూహ్యంగా కామన్ మ్యాన్ కళ్యాణ్ ఉన్నాడు, నాగార్జున క్లాస్, నాలుగో వారం టాస్క్ లు అతనికి ఓటింగ్ పెరిగేలా చేసాయి. ఆ తరవాత మూడో స్థానంలో సుమన్ శెట్టి ఉన్నాడు,
నాలుగో స్థానంలో భరణి, ఆతర్వాత సంజన, శ్రీజ ఉంటే.. చివరిగా డిమోన్ పవన్, ఫ్లోరా, రీతూ లు ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చారు. మరి ఈ వారం టాస్క్ లు చూసి ఫైనల్ గా ఎవరిని బుల్లితెర ప్రేక్షకులు ఎలిమినేట్ చేస్తారో చూడాలి.