దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న SSMB 29 చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఆఫ్రికా అడవుల్లో జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషినల్ టచ్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. మహేష్ బర్త్ డే రోజు నవంబర్ లోనే SSMB 29 కు సంబందించిన సర్ ప్రైజ్ ఉంటుంది అంటూ వదిలిన ప్రీ లుక్ పోస్టర్ లోనే మహేష్ లుక్ పై ఓ స్పష్టత వచ్చేసింది అభిమానులకు.
మహేశ్ మెడలో నంది, త్రిశూలం-ఢమరుకం లాకెట్ ఉంది, అందుకే రాజమౌళి కూడా ఈ కథకు రిలీటెడ్ గా ఓ కొత్త టైటిల్ ను అది కూడా పాన్ ఇండియా భాషలకు బాగా దగ్గరయ్యే టైటిల్ అనుకుంటున్నారట. అది వారణాసి అనే టైటిల్ ను రాజమౌళి మహేష్ చిత్రానికి పెట్టబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రంలో కాశీ బ్యాక్ డ్రాప్ లోనే మేజర్ పార్ట్ షూటింగ్ ఉంటుంది, అందుకోసమే ప్రత్యేకంగా కోట్లు ఖర్చు పెట్టి కాశీ సెట్ వేశారనే విషయం తెలిసిందే.
అలాగే ప్రియాంక చోప్రా-మహేష్ కాంబోలో నాటు నాటు కు మించిన సాంగ్ షూట్ చేస్తున్నారని, పృథ్వీ రాజ్ సుకుమారన్ తో మహేష్ యాక్షన్ అన్నిటిలో హైలెట్ గా ఈ చిత్రానికి నిలవబోతుంది అంటున్నారు. మరి నవంబర్ లో రాజమౌళి ఇవ్వబోయే టైటిల్ వీడియో పై ఇప్పటినుంచే అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది.