Advertisement
Google Ads BL

ఇండస్ట్రీ బ్యాన్ రూమర్స్-రియాక్ట్ అయిన రష్మిక


కిర్రాక్ పార్టీ సక్సెస్ సెలెబ్రేషన్స్ నుంచి ఆ చిత్ర బృందంతో పాటుగా రష్మిక మందన్న పై కన్నడ ప్రేక్షకులు కూడా గరంగరంగానే ఉన్నారు.  ఆతర్వాత రష్మిక కన్నడ అమ్మాయిని కాదు అని మాట్లాడడం, ఇంకా చాలా విషయంలో రష్మికపై కన్నడ నుంచి తీవ్ర వ్యతిరేఖత కనిపించింది. ఇప్పుడు కూడా ఆమె అఖండ విజయం సాధించిన కన్నడ కాంతార చాప్టర్ 1 పై స్పందించకపోవడంతో ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అనే పుకారు షికారు చేస్తుంది. 

Advertisement
CJ Advs

తాజాగా రష్మిక కన్నడ బ్యాన్ పుకార్లపై రియాక్ట్ అయ్యింది. ఏ సినిమా అయినా రిలీజ్ అయిన ఫస్ట్ 2 డేస్ లో నేను చూడలేను. కాంతార చిత్రమైనా అంతే. ఆ సినిమా విడుదలయ్యాక కొన్ని రోజుల తర్వాతే చూశాను. మూవీ యూనిట్ ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు తెలిపారు. 

మా వెనుక ముఖ్యంగా తెర వెనక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పర్సనల్ లైఫ్ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. అంతేకాదు నేను ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే వ్యక్తిని కాదు, అందుకే ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. ఆడియన్స్ నా గురించి, నా పెరఫార్మెన్స్ గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే నేను పట్టించుకుంటాను అంటూ రష్మిక తను నటించిన తామా మూవీ ప్రమోషన్స్ లో కన్నడ బ్యాన్ పై రియాక్ట్ అయ్యింది. 

Rashmika Finally Breaks Silence on Industry Ban Rumours:

Rashmika Mandanna Reacts to Rumours of Industry Ban
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs