మెగాస్టార్ చిరంజీవి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే మనలోని ఎనేర్జి ఏమాత్రం తగ్గలేదు అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. వరసగా సినిమాలు చెయ్యడం, నాలుగు షిఫ్ట్ ల్లో పని చెయ్యడం, ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చెయ్యడమే కాదు.. 80s రీయూనియన్ పార్టీలో మెగాస్టార్ చిరు కుర్రాడిలా మారిపోయి డాన్స్ లు చేశారు.
తాజాగా రవి స్టూడియోస్ నిర్వహించిన ఒక ప్రత్యేక ఫొటోషూట్‌లో మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్స్ తో దిమ్మతిరిగేలా చేసారు. మాములుగా అమ్మాయిలు, హీరోయిన్స్ ఫోటో షూట్స్ అయితే వాళ్ళ గ్లామర్, కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకుంటాం.. కానీ మెగాస్టార్ ఫోటోషూట్ చూసి మెగా లుక్ కి ఫిదా అవుతూ.. 70 ఏజ్ లో చిరు ఇంత ఫిట్ గా ఇంత హ్యాండ్ సమ్ గా ఉన్నాడేంటిరా బాబు అంటున్నారు.
ఆయన ఫిట్‌నెస్, గ్రేస్ చూస్తే కుర్ర హీరోలు షేకైపోవాలి. ప్రస్తుతం ఆయన మన శంకర వరప్రసాద్ గారు మూవీలోను వింటేజ్ లుక్ లో అద్దరగొట్టేస్తున్నారు. ఆ చిత్రం సంక్రాంతికి విడుదలకాబోతుంది. ఆతర్వాత సమ్మర్ కి వసిష్ఠ-విశ్వంభర తో చిరు రాబోతున్నారు. ఈలోపు బాబీ, శ్రీకాంత్ ఓదెల చిత్రాలు లైన్ లో ఉన్నాయి.