Advertisement
Google Ads BL

దివాళి వరకు తిరుగు లేదు


అవును కన్నడ కాంతార చాప్టర్ 1 చిత్రానికి దివాళి వరకు ఎదురు లేదు అనే చెప్పాలి. అక్టోబర్ 2 న పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదలైన కాంతార చాప్టర్ 1 కు బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఈ చిత్రానికి కన్నడ నుంచి తెలుగు వరకు అద్దిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ లోనే కాంతార కళ్ళు చెదిరే కలెక్షన్స్ కొల్లగొట్టింది.

Advertisement
CJ Advs

ఈ వారం కూడా కాంతార చాప్టర్ 1 కు ఎదురు లేదు, జస్ట్ చిన్న సినిమాలే తెలుగులో విడుదల కావడం, తమిళ్, అలాగే మలయాళ, కన్నడ నుంచి కూడా ఎలాంటి క్రేజీ సినిమాలు ఈ వారం విడుదల కాకపోవడంతో కాంతార చాప్టర్ 1 కు కలిసొచ్చేలా ఉంది. అందులోను కాంతారా డివోషనల్ గా కనెక్ట్ అవడంతో రిపీటెడ్ ఆడియన్స్ కాంతార థియేటర్స్ కు క్యూ కడుతున్నారు.

ఈ వారం ఎలా ఉన్నా అక్టోబర్ మూడో వారంలో తెలుసు కదా, కె రాంప్, డ్యూడ్, మిత్రమండలి ఇలా క్రేజీ యూత్ ఫుల్ మూవీస్ వస్తున్నాయి. సో అప్పటివరకు తెలుగులో కాంతార కు ఎదురుండకపోవచ్చు. ఈ లెక్కన దీపావళి వరకు కాంతార చాప్టర్ 1 కు ఎదురు లేదు, తిరుగు లేదు.. దీనిని బట్టి కాంతార ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు అనేది ఊహించడము కష్టమే. 

Kantara Chapter 1 collections :

Kantara Chapter 1 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs