రవితేజ-శ్రీలీల ధమాకా డాన్స్ లు, పాటలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. అంత ఎనేర్జిటిక్ గా రవితేజ, శ్రీలీలే డాన్స్ స్టెప్స్ ఉంటాయి. మరోసారి ఈ హిట్ పెయిర్ జోడి కట్టింది. భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర సినిమాతో ఈ నెల చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ వదిలారు మేకర్స్.
రవితేజ వింటేజ్ లుక్, శ్రీలీల విలేజ్ గర్ల్ లుక్స్ అన్ని ఈ సాంగ్ లో హైలెట్ అవ్వడమే కాదు, సాంగ్ ఎంత స్వీట్ గా ఉందొ, రవితేజ, శ్రీలీల జోడి అంత క్యూట్ గా ఉంది. మరీ మాస్ స్టెప్స్ లేకపోయినా రవితేజ డాన్స్ ఇంప్రెస్స్ చేస్తుంది. శ్రీలీల ఇన్నోసెంట్ లుక్స్, ఆమె ట్రెడిషనల్ అవతార్ ఆకట్టుకుంటున్నాయి.
సాంగ్ విజువల్స్, విలేజ్ బ్యాక్ డ్రాప్ అన్ని ఈపాటకు హైలెట్ గా నిలిచాయి. హుడియో హుడియో సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో శ్రావ్యంగా మరియు హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ చిత్రానికి తగ్గట్టుగా ఓ సరికొత్త మెలోడీని అందించారు.