తిరుపతి వద్ద మంచు మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీ పై గత ఏడాది మంచు మనోజ్ అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చెయ్యడం దగ్గరనుంచి హాస్టల్స్ లో లేకపోయినా మెస్ ఫీజ్ కట్టాలని విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నారని మంచు మనోజ్ అప్పట్లో ఆరోపించారు.
తాజాగా మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి ₹26 కోట్ల అదనంగా వసూలు చేశారని మోహన్ బాబు యూనివర్సిటీపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో.. ఉన్నత విద్యా మండలి విచారణ చేపట్టింది. ఈ విచారణలో మోహన్ బాబు యూనివర్సిటీ అధిక ఫీజుల అక్రమ వసూళ్ళు నిజమేనని నిగ్గు తేల్చడంతో మోహన్ బాబు యూనివర్సిటీకి ₹15 లక్షల జరిమానా విధించారు.
అంతేకాకుండా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ₹26 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీచెయ్యడమే కాకుండా.. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని... ఏపి ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి సిఫార్సు చేయనుందని తెలుస్తుంది.