రష్మిక మందన్న తృటిలో తప్పించుకుంది.. లేదంటే రష్మిక తో ఎంగేజ్మెంట్ జరిగింది, వెంటనే విజయ్ దేవరకొండ కు యాక్సిడెంట్ అయ్యింది అనేవారు. విజయ్ దేవరకొండ యాక్సిడెంట్ నుంచి చిన్న గీత కూడా తగిలించుకోకుండా బయటపడడం రష్మిక అదృష్టమే అంటున్నారు.
ఆ యాక్సిడెంట్ లో గనక విజయ్ దేవరకొండ కి చిన్నపాటి దెబ్బతగిలినా అది రష్మిక మీదకే వచ్చేది, ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి, రీసెంట్ గా నిశ్చితార్ధం చేసుకున్న రష్మిక-విజయ్ దేవరకొండలు ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఎంగేజ్మెంట్ అవ్వగానే రష్మిక హైదరాబాద్ నుంచి తన షూటింగ్స్ నిమిత్తం వెళ్లిపోగా విజయ్ దేవరకొండ స్నేహితులతో కలిసి పుట్టపర్తి వెళ్ళాడు.
హైదరాబాద్ కి తిరుగు ప్రయాణంలో విజయ్ దేవరకొండ కారు కు యాక్సిడెంట్ అయినా.. ఆ ప్రమాదంలో విజయ్ కారుకు డ్యామేజ్ అయ్యింది కానీ విజయ్ కి ఎలాంటి ప్రమాదం జరగకుండా సేవ్ అయ్యాడు, అదే ఆ ప్రమాదంలో విజయ్ దేవరకొండ కు ఏమైనా అయ్యి ఉంటే అదిగో రష్మిక జాతకం బాలేదు అందుకే విజయ్ దేవరకొండకు ప్రమాదం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేసేవారు.
విజయ్ రోడ్ ప్రమాదం నుంచి బయటపడడంతో రష్మిక ఆ ట్రోల్స్ నుంచి తృటిలో తప్పించుకున్నట్టే కదా..!