సమంత కొన్నాళ్లుగా నటనకు బ్రేకిచ్చేసింది. అయినప్పటికీ సమంత హీరో సినిమాలో నటిస్తుంది, ఈ హీరో సినిమాలో నటిస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ సమంత మాత్రం తన అనారోగ్యం వలన సినిమాలేవీ ఒప్పుకోలేదు అని చెప్పింది. ఆతర్వాత సమంత పై ఏ సినిమా రూమర్స్ వినిపించలేదు.
ఇప్పుడు ఈ నెలలోనే మా ఇంటి బంగారం షూటింగ్ మొదలు పెడతున్నట్టుగా సమంత అభిమానులకు అలా అప్ డేట్ ఇచ్చిందో లేదో.. ఇలా మళ్లీ ఆమె పై రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా తమిళనాట హీరో శింబు-వెట్రిమారన్ కలయికలో తెరకెక్కుతున్న అరసన్ మూవీలో సమంత ను హీరోయిన్ గా సంప్రదిస్తున్నారనే వార్త మొదలయ్యింది.
సమంత హీరో శింబు తో జత కట్టబోతుంది అంటున్నారు. మరి ఇది నిజామా.. లేదంటే రామ్ చరణ్ పెద్ది, విజయ్ జన నాయగన్ చిత్రాల్లో సమంత నటిస్తుంది అనే వార్తలులా రూమర్ గా మిగిలిపోతుందో అనేది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.