నేడు అక్టోబర్ 7 న నారా రామ్మూర్తి నాయుడు ప్రధమ వర్ధంతిని నారా వారి ఫ్యామిలీ శాస్త్రోక్తంగా జరిపించారు. నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడు గారి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబబు ఆయన భార్య భువనేశ్వరి, నారా లోకేష్, మిగతా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నారావారిపల్లెలోని రామ్మూర్తినాయుడు నివాసంలో ఆయన ప్రథమ వర్థంతిని కొడుకు నారా రోహిత్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లతోపాటుగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రామ్మూర్తినాయుడు గారి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. అందుకు సంబందించిన ఫోటోలను నారా లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.