హరి హర వీరమల్లు చిత్రం డిజప్పాయింట్ చేసినా ప్రస్తుతం రాజా సాబ్ పైనే ఆశలు పెట్టుకుంది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ప్రభాస్ రాజా సాబ్ లో నిధి అగర్వాల్ గ్లామర్ గా కనిపించబోతుంది. అంతేకాదు రీసెంట్ గా రాజా సాబ్ ట్రైలర్ లో మిగతా హీరోయిన్స్ కన్నా నిధి అగర్వాల్ తోనే ప్రభాస్ రొమాన్స్ నచ్చింది అన్నారు.
ఇక రాజా సాబ్ టీమ్ ప్రస్తుతం యూరప్ లో విహరిస్తోంది. అక్కడ రాజా సాబ్ సాంగ్ షూట్ కోసం వెళ్లారు. మారుతి, నిధి అగర్వాల్, నిర్మాత SKN లు యూరప్ వీధుల్లో విహరిస్తున్న ఫొటోస్ షేర్ చేస్తే.. నిధి అగర్వాల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి షేర్ చేసిన పిక్స్ మాత్రం అద్దిరిపోయాయనే చెప్పాలి.
లైట్ మధ్యన రెడ్ హాట్ డ్రెస్ లో నిధి అగర్వాల్ అందాల ఆరబోత చూసి ఈ బ్యూటీ కి తొందరగా ఓ హిట్టు ఇవ్వవయ్యా దేవుడా అంటూ ఆమె అభిమానులు దేవుణ్ణి కోరికలు కోరేస్తున్నారు. నిజంగా ఆ లైట్స్ మధ్యన చందమామలా నిధి అగర్వాల్ వెలిగిపోతున్న పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.