పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఓజీ రెండు వారాల క్రితమే అంటే సెప్టెంబర్ 25 న విడుదలై పవన్ ఫ్యాన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసింది. ఓజి లో పవన్ కళ్యాణ్ కేరెక్టర్, ఆయన లుక్స్ థమన్ BGM , సినిమాటోగ్రఫీ, దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. కథ లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కి మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.
దానితో ఓజి అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొడుతుంది అన్నారు కాదు అనుకున్నారు. మొదటి రోజే ఓపెనింగ్ పరంగా రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన ఓజి కలెక్షన్స్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పుడు ఓజి చిత్రం మరో రేర్ రికార్డ్ ను అందుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో రూ. 300 కోట్ల మార్క్ సాధించిన చిత్రంగా ఓజి నిలిచింది.
ఓజి దసరా హాలిడేస్ లో అంటే 11 రోజులకు గాను 300 కోట్ల గ్రాస్ సాధించి తన ఖాతాలో రేర్ రికార్డ్ ని వేసుకుంది. ఇదంతా బాగానే ఉంది.. ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి బాగానే ఉంది కానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కి ఓజి నష్టాలూ వచ్ఛాయి, వాళ్లు నిర్మాత దానయ్యకు ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ ఎత్తడం లేదు అనే మాట ఎందుకు బయటికి వచ్చింది, ఎవరు ఇది స్ప్రెడ్ చేస్తున్నారో అనేది మాత్రం అందరిలో ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి అర్ధం కానీ కన్ఫ్యూజన్.