బిగ్ బాస్ సీజన్ 9 లో నాలుగు వారాలకు గాను నలుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం సెలెబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయితే.. గత మూడు వారాలుగా కామనర్స్ కోటాలో మనీష్, ప్రియా, హరిత హారిష్ లు వరసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు ఎవరెవరు సోమవారం నామినేషన్స్ లోకి వచ్చారో అనేది ఆసక్తిగా మారింది.
ఈ వారం రాము రాధోడ్ కెప్టెన్ గనక అతను తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ అందరిని పరుపుపై ఎక్కి ఎవరు చివరివరకు పరుపుపై నిలబడతారో వారు ఇమ్యూనిటీ పొందుతారని వాళ్లలో వాళ్ళకే గొడవ పెట్టారు. అందులో భరణితో శ్రీజ వాళ్ళు గొడవపెట్టుకున్నారు. సంజన, శ్రీజ, రీతూ, పవన్ వీళ్లంతా భరణితో గొడవపడ్డారు. దివ్య ని పడేశారని ఆమె ఫైట్ చేసి ఏడ్చేసింది.
ఆ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ లు సేవ్ అయ్యి మరో టాస్క్ ఆడారు. నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలవడంతో.. కెప్టెన్ రాము, ఇమ్ము ఇద్దరూ తప్పితే మిగిలిన వాళ్లంతా ఈవారం నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.