మూడు రోజుల క్రితమే తన ఇంట్లో తన ప్రేమికురాలు, టాప్ హీరోయిన్ రష్మిక మందన్న తో నిశ్చితార్ధం చేసుకుని హీరో విజయ్ దేవరకొండ నిన్న ఆదివారం తన స్నేహితులతో కలిసి పుట్టపర్తి వెళ్లి అక్కడ సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం చేసుకోవడమే కాకుండా పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయం, మరికొన్ని చోట్ల తిరిగి ఈరోజు సోమవారం హైదరాబాద్ బయలుదేరారు.
అయితే విజయ్ దేవరకొండ ఆయన స్నేహితులు ప్రయాణిస్తున్న కారు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. రోడ్ లో ఎదుట ప్రయాణిస్తున్న బొలెరా అకస్మాత్తుగా కుడివైపుకు తిరిగింది. వెనక నుంచి వస్తున్న విజయ్ లెక్సస్ కార్ బొలెరా ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ ఆయన స్నేహితులు సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తుంది.
ఈ రోడ్ ప్రమాదంలో విజయ్ దేవరకొండ కారు స్వల్పంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన విజయ్ దేవరకొండ స్నేహితుడి కారులో అక్కడి నుంచి హైదరాబాద్ కి వచ్చేసారు. ఈ ప్రమాదంలో విజయ్ కు ఎలాంటి గాయాలు అవ్వలేదని తెలిసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.