కొన్నాళ్లుగా సమంత సినిమా సెట్స్ లో కనిపించడం లేదు, సినిమాలకు బిగ్ బ్రేక్ ఇచ్చిన సమంత హిందీలో రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సీరీస్ లో నటించినా అది ఇప్పుడు షూటింగ్ జరుపుకోకుండా ఆగిపోయింది. ఇక ఆమె నిర్మించిన శుభం చిత్రంలో చిన్నపాటి క్యామియో లో కనిపించి మాయమైన సమంత అసలు కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ఒప్పుకోవడం లేదు.
హెల్త్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టడమే కాదు పాడ్ క్యాస్ట్ ద్వారా ఆమె హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంది. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, నేను పనిలో పడి అసలు సమయంలో ఎంజాయ్ చెయ్యలేకపోయాను అంటూ సమంత అందరిని మోటివేట్ చేస్తుంది. ఫైనల్లి సమంత చాలా రోజుల తర్వాత పనిలో పడుతుంది. అందుకే ఆమె హైదరాబాద్ వచ్చింది.
సమంత లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం చిత్రం షూటింగ్ పాల్గొంటున్నట్లుగా చెప్పడమే కాదు.. ఈమధ్యనే సమంత ముంబై లో కొత్త ఇల్లు కొనుక్కుని ఆ ఇంటి ఫొటోస్ ని షేర్ చేస్తూ న్యూ జర్నీ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక సమంత సినిమా షూటింగ్ కి హాజరవుతూ ఉండడంతో ఆమె అభిమానులు హ్యాపీ గా ఫీలవుతున్నారు.