రిషబ్ శెట్టి హీరోగా, ఆయనే డైరెక్షన్ లో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 పాన్ ఇండియా థియేటర్స్ లో అక్టోబర్ 2 న విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి వీకెండ్ లో కాంతార చాప్టర్ 1 థియేటర్ లో ఫుల్ ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. నార్త్ లో ఎలా ఉన్నా సౌత్ లో మాత్రం కాంతార కలెక్షన్స్ ఫుల్ గా కుమ్మేస్తున్నాయి.
ఫస్ట్ వీకెండ్ లో కాంతార చాప్టర్1 రూ.335 కోట్లు గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్టు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వదిలారు. అది చూసిన పాన్ ఇండియా ఆడియన్స్ కాంతార చాప్టర్ 1 ఫస్ట్ వీకెండ్ లో రూ.335 కోట్లు కొట్టింది అంటున్నారు. అయితే సౌత్ లో అదిరిపోతున్న కాంతార 1 కలెక్షన్స్, నార్త్ లో కాస్త అటు ఇటుగా కనిపిస్తున్నాయి.
కన్నడలో కాంతార భీబత్సం మరీ ఎక్కువవుంది. ఒక్క ఆదివారమే కాంతార థియేటర్స్ ఫుల్ గా కళకళలాడాయి. మళ్లీ మరో వారం కాంతార కు కలిసొచ్చినట్టే. కారణం మరో వారంలో పెద్ద సినిమాలు, ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏమి లేవు. కాబట్టి కాంతార చాప్టర్ 1 కు మరిన్ని కలెక్షన్స్ పెరగడం ఖాయం.